రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సమతా సభ ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. సాయంత్రంఆరు గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది అని ఆయన చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల…
హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలో ఇంఛార్జుల మార్పు కొనసాగుతూనే ఉంది. టికెట్టు విషయంలో చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా పార్టీ పెద్దల నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ తుది కసరత్తు చేస్తున్నారు.
సీఎం జగన్ తో సమావేశంలో మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తన భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని చెప్పారు. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు.. తనకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసని చెప్పారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చేయాలో సీఎం జగన్ కు తెలుసన్నారు. మరోవైపు.. ఈ నెలలో కర్నూల్…
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు…
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పార్టీని ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా నడుపుతున్నాడని విమర్శించారు. జగన్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేటు కంపెనీని నడుపుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడం లేదని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే బదిలీ చేయాలని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. 12 మంది దళిత శాసన…
శింగనమల ఎమ్మెల్యే పద్మావతి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది పద్మావతి తెలిపారు. హైకమాండ్ ఆదేశాలతో పద్మావతి మీడియాకు వివరణ ఇచ్చారు. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'రా కదలిరా' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో రాక్షసులు భయపడేలా పాలన ఉందని ఆరోపించారు. హిట్లర్ కూడా ఈ పాలన చూసి భయపడతారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పని లేదని భూమా అఖిలప్రియ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గూండాల్ని తయారు చేశారని మండిపడ్డారు. గుండాలను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని అఖిలప్రియా దుయ్యబట్టారు.
మంత్రి గుడివాడ సీటుపై అధిష్టానం క్లారిటీ.. అక్కడి నుంచి పోటీ..! రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తులు చేస్తుండగా.. పార్టీ గెలవలేని చోట గెలిచే అభ్యర్థిని ఖరారు చేస్తుంది అధిష్టానం. ఈ క్రమంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడో తెలిపింది. అతని సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు. పెందుర్తిలో కాపు, వెలమ ఓట్లు…