CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు.
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి…
నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం కిర్తి ప్రతిష్ట నిలిపిన ప్రజలందరికి ధన్యవాదాలు చెప్పారు. నన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి.. గతంలో ఏ ప్రభుత్వం…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే.
సీఎస్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి ఏపీ హైకోర్టు నోటీసులు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
సీఎం జగన్ సమక్షంలో బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ వైసీపీలో చేరారు. గతంలో ఆమే బీజేపీ ఎంపీగా పని చేశారు. అయితే.. హిందూపూర్ ఎంపీగా బరిలో శాంతమ్మను నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలో అధికారికంగా చేరింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ.. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరానని అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు.
పాకిస్థాన్ తో చర్చలపై భారత్ కీలక వ్యాఖ్యలు.. భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు. చర్చల కోసం భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ చాలా కాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ,…
గుంటూరు జిల్లా తాడికొండలో సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. తనకు గతంలో తాడికొండలో పోటీ చేయమని అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని.. తాడికొండ అభ్యర్థి నువ్వే అని సీఎం కూడా చెప్పారన్నారు. తనకు సంబంధం లేకుండానే సమన్వయకర్తగా నియమించారని తెలిపారు.