సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పార్టీని ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా నడుపుతున్నాడని విమర్శించారు. జగన్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేటు కంపెనీని నడుపుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడం లేదని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే బదిలీ చేయాలని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. 12 మంది దళిత శాసన సభ్యుల్ని ట్రాన్స్ ఫర్ చేయడం అవివేకమన్నారు. దళితుల్ని రాజకీయాల్లో స్థిరపడకుండా చేయడంలో భాగమే ఇది అని ఆరోపించారు. జగన్ మాటలు నమ్మి అత్యుత్సాహంతో ఓట్లు వేసిన దళితుల్ని జగన్ అడుగడుగునా అవమానిస్తున్నారని దుయ్యబట్టారు.
Viral Video: గోవాలో మాజీ మంత్రి మల్లారెడ్డి విన్యాసాలు .. దుబాయ్ లో చిల్ అవుతున్న తలసాని..
తాము వైసీపీ పార్టీలో ఉండబోమని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతులు కట్టుకొని నిలబడితే, వేదికపై కుర్చీలలో రెడ్లు కూర్చొని దళితుల్ని అవమానించారని మండిపడ్డారు. పినిపే విశ్వరూప్ కు సీటు లేక మోకాళ్లపై నిలబెట్టడం వైసీపీ దళితులకిచ్చే గౌరవాన్ని తెలియజేస్తోంది. మేకల్నే బలిస్తారు, పులులను కాదు అని అంబేద్కర్ ఏనాడో చెప్పారు, అందుకే 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేశారని ఆరోపించారు. అంబేద్కర్ పై జగన్ కు చిత్తశుద్ధి లేదు.. ఉంటే అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టుకోరని అన్నారు.
అంబేద్కర్ విగ్రహాలు పెట్టిస్తే చిత్తశుద్ది ఉన్నట్లు కాదు.. ఆయన ఆశయాలు పాటిస్తేనే అని అన్నారు. చిత్తశుద్ధి లేకుండా అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే దళితులపై దాడులకు పాల్పడడం పోతుందా? అని ప్రశ్నించారు. 188 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్న పాపం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే పోతుందా? అని విమర్శించారు.
Mahesh Babu: సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే మన బాబే..
జగన్ ప్రజా రక్షకుడు కాదు.. ప్రజా బక్షకుడని కోడికత్తి శీను కేసులో స్పష్టమైందని వర్ల రామయ్య ఆరోపించారు. ఐదేళ్లుగా అతను జైల్లో మగ్గుతుంటే, జగన్ అంబేద్కర్ విగ్రహం వేస్తే సరిపోతుందా? అని అన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలో నుంచి అత్యుత్సాహంతో వైసీపీలోకి వెళ్లి అడుగడుగునా అవమానాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే జగన్ చేసుకున్న పాపాలు పోతాయా? అని దుయ్యబట్టారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంబేద్కర్ పై గౌరవంతో కాదు.. రాజకీయ లబ్ధి కోసమే ఏర్పాటు చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. నిజంగా అంబేద్కర్ పై చిత్తశుద్ధి ఉంటే అమరావతిలోని స్మృతి వనాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి యాత్రా స్థలంగా మార్చి ఉండాల్సిందని పేర్కొన్నారు.