రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సమతా సభ ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. సాయంత్రంఆరు గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది అని ఆయన చెప్పారు. సమతా సభకు చెందిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అభిమానించే ప్రతి ఒక్కరూ రావాలనే ఆసక్తితో ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
Read Also: Saindhav : వెంకటేష్ సైంధవ్ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?
ఈ సమతా సభకు దాదాపు లక్షా 50 వేల కంటే ఎక్కువ మంది వస్తారని ఎంపీ విజయ సాయిరెడ్డి అంచనా వేశారు. జీవం ఉట్టిపడే ఇటువంటి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో నేను ఎక్కడా చూడలేదు అని పేర్కొన్నారు. ఇలాంటి కలను ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్లలోనే సాకారం చేశారు అని ఆయన తెలిపారు. ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారు.. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు అని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు.