దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దీని పై గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదు అన్న ఆయన అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం జరగనుంది. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల సర్వే నిర్వహించాలని… విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ కు ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఇక దసరా నవరాత్రులు, బ్రహ్మొత్సవాలు వస్తుండటంతో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించాం అని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి.