ఏపీ సిఎం జగన్ కు జనసేన నేత పోతిన వెంకట మహేష్ లేఖ రాశారు. 2020 దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి తమరు హామీ ఇచ్చినట్టుగా 70 కోట్ల నిధులను తక్షణమే అమ్మవారి ఆలయానికి మళ్ళించాలని… ఇంతవరకు నిధులు రాలేదని ఈవో భ్రమరాంబ గారు లిఖితపూర్వకంగా తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తున్నారని.. 2019 & 2020 దసరా ఉత్సవాలకు సంబంధించిన నిధులను కూడా తమరు మంజూరు చేయలేదన్నారు.
2021 దసరా ఉత్సవాలు నాటికి ఈ మూడు సంవత్సరాల దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదల చేయ గలరని.. దుర్గగుడి అభివృద్ధి కోసం 70 కోట్ల ఖర్చుకు ఒక నిజాయితీ గలిగిన ఐఏఎస్ అధికారిని పర్యవేక్షణ కోసం నియమించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గ్యాంగ్ దోచుకునే ఆస్కారముందని…తిరుమల తిరుపతి దేవస్థానం పై సామాన్య భక్తులకు ఉచిత దర్శనాలను పునరుద్ధరించాలన్నారు. కేవలం డబ్బును వారిని అనుమతించడం వల్ల సామాన్యులను శ్రీ వారికి దూరం చేయొద్దని కోరారు.