1. నేడు విశాఖకు సీఎం జగన్. శ్రీశారదా పీఠం సందర్శన, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్. దాదాపు రెండు గంటలు శారదా పీఠంలో ఉండనున్న సీఎం జగన్. 2. నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం. 3.…
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIMV) శాశ్వత క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంప్‌సను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనాపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి కృషంరాజు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లీలా గ్రాండ్ హోటల్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోంది.. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత.. రాయలసీమకు జనసముద్రం వస్తే.. ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ…
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి.. చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అని అన్నారు. తన…
ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో,…
రాప్తాడు సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఆశ చూపించి రైతన్నలను మోసం చేశాడని దుయ్యబట్టారు. గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని డైలాగ్ కొట్టారు. మనం…