ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయిందన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వడం లేదు అని ఆరోపించారు.
TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ…
రేషన్ లబ్ధిదారులకు మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో…
1. నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్, గవర్నర్. 2. నేటి నుంచి హైదరాబాద్‌లో సీపీఎం ప్లీనరీ సమావేశాలు. రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాలు. 3. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,740 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600…
నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. పార్టీ నేతలతో కీలక భేటీ నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకోనున్నారు. అక్కడ తొలుత తోట సీతారామలక్ష్మీతో ఆయన సమావేశం కానున్నారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలుసుకుని ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా పవన్ కలవనున్నారు. వీరిద్దరితో మర్యాదపూర్వకంగానే జనసేనాని భేటీ…
సీఎం జగన్ చేస్తోన్న బటన్ కామెంట్లపై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను ఆయన ట్వీట్ చేశారు. జగనుకు రెండోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం అనే అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. చిత్తూరులో వైసీపీ మూకల దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోవడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే? మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి… అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి..రూ. 57,350 వద్ద ఉండగా, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర పై రూ. 10 తగ్గి.. రూ. 62,560 వద్ద ఉంది.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి..…
ఏపీ సీఎం జగన్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి 11.40 గంటల వరకు చేరుకుంటారు.