హరిత విప్లవం నీలి విప్లవం వచ్చాయని.. ఉద్యోగ విప్లవం తెచ్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డేనని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
43 మంది భారతీయుల్ని బహిష్కరించిన మాల్దీవ్స్.. చైనాపై మాత్రం చర్యలు లేవు.. మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో…
విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకల్లో సీఎం జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు-వైజాగ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీ దాదాపు 50 రోజుల పాటు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం.. మట్టిలోని మాణిక్యాలను గుర్తించడానికే ఆడుదాం ఆంధ్రా అని అన్నారు. 47…
Vyooham Trailer: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.
మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఈ ముగ్గురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. వీరికి సీఎం బీఫాం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ…
జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే దళిత సింహగర్జన ఉద్దేశమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. మరోసారి జగన్ సీఎం అయితే దళితులకు రక్షణ ఉండదన్నారు. రాజమండ్రిలో దళిత సింహ గర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఈ సభ పెట్టలేదని వివరణ ఇచ్చారు. తనకు పదవులు కొత్తకాదని చెప్పారు. ఆత్మగౌరవం కోసం దళితుల సింహ గర్జన బహిరంగ సభ పెట్టానని.. జగన్ అహంకారానికి దళితుల ఆత్మగౌరానికి…
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెండు వైపులా.. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరు గెలిస్తే బాగానే ఉంటుంది.. ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు.. ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అంటారని అన్నారు. తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప.. పార్టీలో ఉండి ఏది చేయనని తెలిపారు. వైఎస్సార్ తమకు ఒకటే నేర్పించాడని.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లి…
వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం కావడంతో సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలను, యువతను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, మహిళలను దగా చేశాడని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో అందరికీ అండగా ఉండాలని నారా లోకేష్ పాదయాత్ర చేసి అనేక సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలని శంఖారావం కార్యక్రమంతో ప్రజలకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.