TDP Leader Bonda Uma Made Comments on CM Jagan. రాష్ట్రంలో పేదలపై 3 ఏళ్లుగా జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సంక్షేమం ఇస్తున్నాం కదా అని వారిపై మోయలేని భారం మోపుతున్నారని, పేదలు, మధ్యతరగతిపై అధికంగా విద్యుత్ చార్జీలు పెంచి ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్ పాలన కాక మరేంటని ఆయన మండిపడ్డారు. జగనన్న బాదుడే బాదుడు పథకంలో ప్రజలపై రూ.38వేల కోట్ల…
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగనుదేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని, స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలను విద్యుత్ షాక్ లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని…
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. నేడు భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత…
TDP MLC Ashok Made Comments on CM Jagan. చీప్ లిక్కరును కాస్ట్ లీ ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్న సీఎం జగన్ తాజాగా కాస్ట్ లీ కరెంట్ పథకం అమలుకు సిద్ధమయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మార్చిన విద్యుత్ శ్లాబులతో 75యూనిట్ల కేటగిరిలో ఉన్నవారు నిన్నటివరకు రూ.169 కడితే, రేపట్నుంచి రూ.304 కట్టాలని, నెలనెలా కేటగిరీలు మారుస్తూ.. 13 శ్లాబుల్ని 6 శ్లాబులుగా…
Andhra Pradesh Deputy CM Amzath Basha about AP Cabinet Expansion. ఏపీ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్తీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఎన్టీవితో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నాకు శిరోధార్యం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గొప్ప అదృష్టం గా భావిస్తున్నాని ఆయన అన్నారు. సీఎం…
ఏపీలో జిల్లా పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది తరువాత కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు. దీనితోపాటు కనీసంగా 15 ఎకరాల…
తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి కాంప్లెక్స్ ను శ్రీ బాలాజీ జిల్లా” నూతన కలెక్టరేట్ కార్యాలయం గా మార్చడాన్ని వ్యకిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది అత్యున్నత ధర్మాసనం. కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల…
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు. 2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.…
ఏపీ ముఖ్యమంత్రి తన టీంని మార్చే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. జిల్లాలు, కులాలు, మతాలు, విధేయత,పార్టీ పట్ల నిజాయితీ వున్నవారిని ఎంపికచేసి కొత్త కేబినెట్ కూర్పు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి? అంశం పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖాయం…