ముస్లింలకు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అయింది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లింలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ఇప్పటికే మసీదులను అందంగా ముస్తాబు చేశారు. నెలవంక దర్శనమిచ్చిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నమాజులు చేపట్టనున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. రంజాన్ నేపథ్యంలో, ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు,…
శుభకృత్ నామ ఉగాది సందర్భంగా సరికొత్త ఆశలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కొత్త గెజిట్ రూపొందించింది. కొత్త జిల్లాల పాలనకు అనుగుణంగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కలెక్టర్ల నియామకం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి, విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీ రావుని నియమించారు. విజయనగరం…
ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారింది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన పూర్తయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 17,500కు పైగా సూచనల పరిశీలన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. కొన్ని జిల్లాల్లో…
సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన శ్రీలంక. దేశవ్యాప్తంగా వివిధ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు పాకిస్తాన్ లో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం. తేలనున్న భవితవ్యం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఈరోజు మత్స్య జయంతి. ఇవాళ్టి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. నేటితో…
ఇటీవల ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. దీంతో అక్కడికక్కడే బేషరతుగా ఐఏఎస్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో సేవాల కార్యక్రమాలు చేయాలని తీర్పును సవరించింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడం దేశ…
ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని, ఉభయగోదావరి జిల్లాల్లో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని, కౌలుదారు చట్టంలో తప్పిదాలు జరిగాయన్నారు. రైతు భరోసాకు కులాలు అంటగట్టడం దుర్మార్గమని, కౌలు రైతులు అల్లాడిపోతున్నారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు…