ఏపీ ముఖ్యమంత్రి తన టీంని మార్చే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. జిల్లాలు, కులాలు, మతాలు, విధేయత,పార్టీ పట్ల నిజాయితీ వున్నవారిని ఎంపికచేసి కొత్త కేబినెట్ కూర్పు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత మంత్రుల్లో బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి? అంశం పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుండటంతో.. మంత్రివర్గ విస్తరణ సైతం త్వరగా పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇక పార్టీ – ప్రభుత్వంలో వచ్చే ఎన్నికల దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో సీనియర్లను కొందరిని ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు,