30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు ఏమైంది? రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు ఏ విషయంలో మథన పడుతున్నారు? రాజకీయ వైరాగ్యం కలిగిందా? అసలు రాజకీయం తెలిసిందా? ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం పరితపిస్తున్నారా? లెట్స్ వాచ్..! గతాన్ని తలచుకుని ఆవేదన30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటుడు పృధ్వీరాజ్. అర్థాంతరంగా రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. పాలిటిక్స్‌లో ఒక ఫుట్‌బాల్‌లా ఎగిరిపడ్డారు పృథ్వీ. ఇప్పుడు ఆ గతాన్ని…
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేత. ఆయనతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన నాయకులు సీఎంలై.. మంత్రులై చక్రం తిప్పారు. ఆయనకు మాత్రం మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఆయన గెలవరు. ప్రస్తుతం పార్టీ మారి అధికారపార్టీ పంచన చేరారు. ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? అసలు ఆయన అలాంటి ఆశలు పెట్టుకున్నారా? ఇంత వరకు మంత్రి కాని కరణం బలరాంకరణం బలరాం.…
TDP MP Rammohan Naidu Made Comments on CM Jagan. ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై కేంద్రం పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ఏపీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారు…
ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్‌లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు…
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. రూ. 48 వేల కోట్లు ఖర్చుకు లెక్కల్లేవంటూ నేను ఏడాది క్రితం చెప్పిన దాన్నే ఇప్పుడు కాగ్ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాగ్ భయపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. రూ. 48 వేల కోట్లంటే.. 30 శాతం మేర బడ్జెట్టుకు లెక్కల్లేవని కాగ్ స్పష్టంగా చెప్పింది. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చూపకుండా ఖర్చు పెట్టేస్తే చూస్తూ…
విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, హాట్ హాట్ డిస్కషన్లు.. వాయిదాల మీద వాయిదాలతో చివరాఖరికి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 7న సభా సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23కి రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. జనరంజక బడ్జెట్ తీసుకువచ్చారంటూ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సభ్యులు వివిధ ప్రజాసమస్యలు ప్రస్తావించారని,…
త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కేబినెట్‌లో కొందరు ఇళ్లకువైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వివాదం రేగుతూనే వుంది. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టాను.. అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చెప్పలేదా..? ఎన్నికల ముందు మూడు రాజధానులని ఎందుకు అనలేదు..? అధికారం ఇచ్చారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తారా..? రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే… న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా..? అన్నారు గద్దె తిరుపతిరావు. జగన్ గారూ.. ప్రజల…
ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు. మహిళలు, రైతులు 800రోజులకు పైగా ఉద్యమం చేశారు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని.. మళ్లీ వివాదం…
ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ చర్చ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. అసెంబ్లీలో ఈరోజు మూడు రాజధానుల ముచ్చట తెచ్చి మూడు ముక్కల ఆటకు మళ్లీ శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. భావితరాల భవిష్యత్‌పై ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిపై ప్రేమ ఉంటే ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా అని.. మంచి మనసు ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో…