తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి కాంప్లెక్స్ ను శ్రీ బాలాజీ జిల్లా” నూతన కలెక్టరేట్ కార్యాలయం గా మార్చడాన్ని వ్యకిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది అత్యున్నత ధర్మాసనం.
కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది. కలెక్టర్ చెట్టు కింద కూర్చుని పనిచేయలేరు కదా…అని వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వానికి సముచిత గౌరవం ఇవ్వాలని వెల్లడించింది సుప్రీంకోర్టు. జిల్లాల పునర్విభజన చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
మరోవైపు కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగుతుంది.