రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా టీడీపీ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం, నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాదుడే బాదుడు పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో పన్నులు నిత్యావసర ధరల పెంపుపై టీడీపీ విన్యూత్నరీతిలో నిరసనలు చేపట్టింది. పాలకొల్లు నియోజకవర్గంలో పెంచిన పన్నులు, నిత్యావసర ధరల పెంపుపై ఈ ప్రభుత్వం బాదుడే బాదుడును ఇంటింటికీ కార్యక్రమం చేపట్టినట్టు టీడీపీ ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నిరసనలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
Chandrababu: కరెంట్ పీకుతున్న జగన్ను.. పవర్ నుంచి పీకేందుకు..!
పాలకొల్లు మండలం అగర్తిపాలెం, గోరింటాడ, కొమ్ముచిక్కాల గ్రామాలో ఇంటింటికీ తిరిగి కొవ్వొత్తులు,అగ్గిపెట్టెలు, లాంతర్లు, విసనకర్రలతో నిరసన తెలిపారు. కరపత్రాలు పంచి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజల నుంచి ఊహాతీతమైన స్పందన రావడం ప్రభుత్వం పై వ్యతిరేకతకు అర్ధం పడుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. కరోనా వల్ల ఆదాయం కోల్పోయిన ప్రజలపై అదనపు భారం మోపుతున్న జగన్ పై ప్రజలు ఆగ్రహంతో వున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.