Pawan Kalyan : ఏ సమయంలో ఎంతివ్వాలో అంతిచ్చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదని, వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలన్నారు. నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలనని, నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో అంతిచ్చేస్తానని ఆయన హెచ్చరించారు. నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడి.. మా సహనాన్ని వైసీపీ పరీక్షించొద్దని, ప్రజలను పల్లకి ఎక్కించేందుకే జనసేన పని చేస్తుందని, జనసేనకు వ్యక్తిగత అజెండాలు ఉండవని ఆయన వెల్లడించారు.
అధికారంలోకి రాకముందు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక అల్పాదాయ వర్గాలపై 57 శాతం విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపుతోందన్నారు. వైసీపీ మాటలకు అర్థాలే వేరులే అన్నది నిరూపితమవుతోందని, కుడి చేత్తో ఇచ్చి.. ఎడం చేత్తో లాగేసుకుంటోంది ఇదే ప్రభుత్వ విధానమని ఆయన మండిపడ్డారు. గతంలో నా దృష్టికి వచ్చిన విద్యుత్ సంబంధిత సమస్యలు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. వాటిని నాటి ప్రభుత్వం పరిష్కరించిందని, పల్లెల్లో 11 గంటల నుంచి 14 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
పట్టణాల్లో ఐదు నుంచి ఆరు గంటల పాటు కోతలు, నగరాల్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు కోతలు, ఆస్పత్రుల్లో కూడా విద్యుత్ కోతలు ఉంటున్న పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల కార్మికుల ఆదాయానికి గండి పడుతోందన్నారు. అప్పులతో పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామిక వేత్తలకు పవర్ హాలిడే శరాఘాతమేనని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!