AP Power Cuts: విద్యుత్ కోతలకు కారణం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరెంటు కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే.సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయింది. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్,
ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జెన్కో యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో రూ. 1058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. జాతీయ ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కొత విధించాల్సి వచ్చింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
https://ntvtelugu.com/former-minister-bandaru-satyanarayana-murthy-counter-to-vijayasai-reddy-comments/
లేక పోతే గ్రిడ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే పరిశ్రమల వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పాం. ఇదీ ఇబ్బందే కానీ తప్పని పరిస్థితి. వ్యవసాయ అవసరాల వినియోగించే విద్యుత్ ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిశ్రమలకు యధావిధిగా సరఫరా జరుగుతుంది. బొగ్గు సరఫరా గురించి సీఎం, ఎంపీలు ప్రధానితో మాట్లాడితే ఎక్కువ సరఫరా మన రాష్ట్రానికి కూడా జరిగే అవకాశం ఉంటుంది.
మన పొరుగు రాష్ట్రాలకు కూడా తీవ్రమైన విద్యుత్ ఇబ్బంది ఉంది. ఆస్పత్రులకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ఎక్స్ఛేంజీల్లో లభ్యత లేని కారణంగా గృహాలకు పరిమితంగా కోతలు విధించాల్సి రావచ్చన్నారు. నికరంగా 30 మిలియన్ యూనిట్ల వరకు లోటు ఉందని, నిన్నటి వరకు పరిశ్రమలకు 10 మిలియన్ యూనిట్ల కోత విధించాం అన్నారు శ్రీధర్.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?