ఏపీలో కేబినెట్ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నారు వైసీపీ నేతలు. ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని కొనసాగించాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. వరుసగా రెండో రోజు మూడు గంటల పాటు కొనసాగింది సమావేశం. దాదాపుగా కొత్త మంత్రివర్గం జాబితా సిద్ధమయిందని తెలుస్తోంది.
సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీకి విధేయత అంశాల ఆధారంగా జాబితాను సిద్ధం చేశారంటున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు సీల్డ్ కవర్ లో జాబితా పంపనున్నట్టు తెలుస్తోంది. నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ దగ్గరకు మంత్రుల రాజీనామా ఫైల్ పంపనున్నారు. ఆ వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేసే అవకాశం వుంది.
https://ntvtelugu.com/tdp-chief-chandrababu-fires-on-cm-ys-jagan-over-power-cuts/
జీఏడీ ద్వారా సీల్డ్ కవర్ లో కొత్త మంత్రుల జాబితా రాజ్ భవన్ కు చేరనుంది. ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేలంతా శిరోధార్యంగా భావిస్తారని అంటున్నా.. అసంతృప్తులు బయటపడుతున్నాయి. ముగ్గురు మంత్రులు మాత్రం ఖచ్చితంగా వుంటారని వార్తలు వస్తున్నాయి. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజీనామా చేసిన మంత్రులను పార్టీ కోసం ఉపయోగించుకుని మళ్ళీ 2024లో వారి పనితీరు ఆధారంగా మరోసారి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రాత్రికి కొత్త మంత్రులు ఎవరనేది తేలిపోనుంది.

సిద్ధమయిన ఆహ్వానపత్రిక