చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చిరకాలం జీవిస్తారని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని.. తమ నాయకుడిని సీఎం జగన్ ఏం పీకలేడని స్పష్టం చేశారు. జగన్ త్వరలోనే జైలుకు పోతాడని.. ఆయన ఉన్న జైలుకు చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి మీకు ముద్ద వేస్తారని కామెంట్ చేశారు. 16 నెలలపాటు జైలులో ఉన్న జగన్ లాంటి చరిత్ర తమకు లేదని ఎద్దేవా చేశారు.
మరోవైపు విజయసాయిరెడ్డి బాగోతం అందరికీ తెలుసని.. విశాఖ భూములపై జీవోలతో తిరుపతి వెంకన్న దగ్గరకురా… ప్రమాణం చేద్దామని బండారు సత్యనారాయణమూర్తి సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి అక్రమాలు బయటపెడితే తమ అంతు చూస్తానని భయపెట్టడం సిగ్గులేనితనంగా ఉందన్నారు. అనేక అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయంలో తాము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విజయసాయిరెడ్డి ఒక ఆడిటర్ అని.. టెక్నికల్‌గా ఆయనకు అన్ని తెలుసన్నారు. ఆయనకు మరోసారి ఛాలెంజ్ చేస్తున్నానని.. ఓసారి జీవో చదువు వీసారెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. 2019లో మార్కెట్ వాల్యూకి 20శాతం ఎక్కువ రేటు ప్రకారం ఇస్తామని చంద్రబాబు జీవో ఇచ్చారని.. వాళ్ళు స్టాంప్ డ్యూటీ ఎగ్జిప్షన్ అడిగారన్నారు. నలుగురితో కమిటీ వేసి లెక్కన ప్రకారం వెయ్యి కోట్లకు ఇవ్వాలని.. కానీ విజయసాయిరెడ్డి రూ. 187 కోట్లకు అప్పనంగా కట్టబెట్టారని ఫైర్ అయ్యారు.
https://ntvtelugu.com/tdp-chief-chandrababu-fires-on-cm-ys-jagan-over-power-cuts/