ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. పీకే ఇచ్చిన నివేదికలో తన ప్రభుత్వ పతనమైందని సీఎం జగన్‌కు తెలిసిందని అందుకే సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. తాను బలంగా ఉన్నాను అనే ప్రయత్నం సీఎం చేస్తున్నారని.. కానీ తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి పీకుడు భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా సీఎం జగన్ ఏం పీకారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ వెళ్లి సీఎం ఏం పీకారని.. పీకడానికి వెళ్ళారా? పీకించుకోవడానికి వెళ్లారో చెప్పాలని పయ్యావుల కేశవ్ నిలదీశారు. బాబాయ్ హత్య, కోడి కత్తి కేసు మీద ఏమి పీకారన్నారు. సీఎం జగన్‌కు అర్ధం కావాలనే తాను ఈ పీకుడు భాష మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఏమి పీకాలో, ఎలా పీకాలో ప్రజలు డిసైడ్ అయ్యారని.. పీకేను పీకేసి జగన్ ఎన్నికలకు వెళ్లగలరా అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకుతావో చూస్తామన్నారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. సీఎం ఇలాగే మాట్లాడితే శంకరగిరి మాన్యాలకి పంపిస్తారన్నారు. దిగజారుతున్న ప్రతిష్ట నుంచి ప్రజలను మరల్చడానికి జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భాష మార్చుకోకపోతే ప్రజలు ఆయన్ను తొందరలోనే సీఎం పదవి నుంచి పీకేస్తారన్నారు. ముఖ్యమంత్రి పీకిన వాటి గురించి ఒక పుస్తకం, పికని వాటి గురించి 10 పుస్తకాలు రాయవచ్చన్నారు.
https://ntvtelugu.com/alert-for-jagananna-amma-vodi-scheme-holders-in-andhra-pradesh/