ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు….70 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో లీకేజీకి విద్యామంత్రి బాధ్యత వహిస్తారా…..సీఎం బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 వేల కోట్లు విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. 48 శాతం మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో , 52 శాతం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై 90 వేలు…
ఏపీని అసని తుఫాన్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అసని తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్‌గా సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. మరో రెండు రోజులో మహేష్ నటించిన సర్కారువారి పాట సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్.. ఇక దీంతో వరుస ఇంటర్వ్యూలతో మహేష్ బిజీగా మారాడు. ఇక తాజగా మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఏపీ సమ్మె జగన్ గురించి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా…
తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ, చైతన్య విద్యాసంస్థల ప్రమేయం ఉందంటూ ఇటీవల ఏపీ సీఎం జగన్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌కు వచ్చి నారాయణను చిత్తూరు పోలీసులు తీసుకెళ్లారు. మాజీ మంత్రి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి ఉన్నారు. మరోవైపు టెంత్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు, కుట్ర పన్ని…
ఏపీలో విద్యావ్యవస్థలో లోపాలపై బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆందోళన వ్యక్తం చేశాయి. పదవ తరగతి పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైలు రాయి. ఏ పని చేయాలన్నా , ఏ ఉద్యోగం చేయాలన్నా మెరిట్ చూస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది పదవ తరగతికి. పదవ తరగతి పరీక్షల్లో మొదటగా తెలుగు పేపర్ లీక్ అయింది. పోనీ తర్వాత జరిగే పరీక్షలు అయినా లీక అవకుండా చూడాలి. ప్రతి పేపర్ లీక్ అయ్యింది. విద్యాశాఖలో ఇంతటీ ఘోరం…
శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4న గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన ఓ షెడ్డులో తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు తొలుత తేజస్విని మృతిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.…
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలను వాడుతున్నారని.. ఇది మంచిది కాదని మంత్రి బొత్స హితవు పలికారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన…
పొత్తులపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉంది. కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం.…
ఆంధ్రప్రదేశ్ లో మహిళల చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత గర్భిణిని ఆదుకోవాలని వైసిపి ప్రభుత్వాన్ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని…
* నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్న పవన్ * మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు *పుట్టపర్తిలో నేడు CPI కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ * గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న వైఎస్‌ఆర్సీపీ జాబ్ మేళా. *ఉదయగిరిలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి *ఆత్మకూరులో…