తిరుమలలో అమలవుతున్న విధానాలు, ధర్మారెడ్డి తీరుపై జనసేన మండిపడింది. ప్రభుత్వం మాదనే ఉద్దేశంతోనే ఇష్టమొచ్చినట్టు తిరుమలలో వ్యవహరిస్తున్నారని ఈవో ధర్మారెడ్డిపై మండిపడ్డారు జనసేన నేత కిరణ్ రాయల్. టీటీడీలో ఏదో జరుగుతోంది, జవహర్ రెడ్డి ని హడావుడిగా బదిలీ చేయడం వెనక కారణం ఏంటి…?గడువు ముగిసిన టీటీడీ ఈఓగా ధర్మారెడ్డిని కొనసాగింపు ఎందుకు….? అని ఆయన ప్రశ్నించారు. ధర్మారెడ్డి దేవస్థానం లా మార్చేశారు. ఏపీలో ఇంకెవరు ఐఏఎస్ లు లేరా…? ఐడిఈయస్ హోదా లో ఉన్న ధర్మారెడ్డి…
నాలుగో ఏడాది తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందించే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతులను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్ మాత్రమే అన్నారు. RBK ల ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 10,779 RBK లను ఏర్పాటు చేయడం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.…
తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జూన్ నెల రాకముందే.. వ్యవసాయ పనులు మొదలు కాకముందే ఖరీఫ్ పంట కి వైఎస్సార్ రైతు భరోసా అందించడం సంతోషంగా వుంది. రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్నాం అన్నారు. మూడేళ్లలో ఎక్కడా కరువు లేదు.. ఒక్కమండలం కూడా కరువు మండలం గా ప్రకటించలేదు.…
ఏలూరు జిల్లా పర్యటనలో వున్నారు సీఎం జగన్. గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పెద్దేరు నది ప్రవాహం పైన బ్రిడ్జి పాడైంది. ఒకవైపు అసనీ తుఫాన్ ప్రభావం వల్ల, గతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల అధిక బరువు గ్రానైట్ లారీలు ప్రయాణం చేయడం వల్ల బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిందే. శరవేగంగా కుంగిన వంతెన శ్లాబ్ తొలగింపు పనులు సాగుతున్నాయి. వంతెన కుంగిపోవడంతో అధికారులు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వాహనదారులు…
రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గణపవరం హెలిప్యాడ్‌కు జగన్ చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు పిప్పర రోడ్డులోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సభా ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు…
ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను ఈ నెల 16న రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు రైతు బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. ఈ ఏడాది మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది.వీరిలో 47 లక్షల మంది భూ…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పై నేను కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తా, రాయించ గలుగుతా అన్నారు. కానీ ..అంత నీచంగా దిగజారి రాజకీయం చేయడం మాకు చేతకాదన్నారు. నాపేరు, కొడాలి నాని పేరు లేకపోతే కొన్ని…
ఏపీ సీఎంపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడుకి తెలిసిన విద్య. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఎగ్గొడుతున్నారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకి లేదు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు…