పొత్తులపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించాం. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టంగా చెబుతున్నాం. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉంది. కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024లో మోడీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చాహర్, శశిభూషణ్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఏపీలో రైతులను సంస్కరించడంలో అధికారాన్ని అనుభవించిన కుటుంబ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయి.రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతును పూర్తిగా మోసగించారు.గతంలో చంద్రబాబు, నేడు జగన్ ప్రభుత్వాలు ఈ అంశంలో దగ చేస్తున్నాయి.
మిల్లర్ల చేతిలో కీలు బొమ్మలుగా చంద్రబాబు, జగన్ మారారు.రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులైతే మోచేతి కింద నీళ్లు తాగే విధానంలో వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులు కలిసి రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా నట్టే ముంచారు.జగన్ ప్రభుత్వం పూర్తిగా రైస్ మిల్లర్లకు అండగా నిలుస్తూ అక్రమాలకు అండగా ఉంటుంది.రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మనునే.. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మనుగా నియమించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే తండ్రిని ఛైర్మన్ చేయడం ద్వారా.. రైతులను మోసగించే వైఖరి అవలంబిస్తున్నారు. కేంద్రం ఇచ్చే అనేక సబ్సిడీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది.
దేశానికి వెన్నెముక అయిన రైతును ఆదుకోవాలని మోడీ అనేక పధకాలు అమలు చేస్తున్నారన్నారు సోము వీర్రాజు. మాట మాటకి సంక్షేమ కార్యక్రమం అనే జగనుకు.. కేంద్రం అమలు చేసే పధకాలు సంక్షేమాన్ని గుర్తు చేయడం లేదేం? ప్రధాని అమలు చేసే సంక్షేమం ముందు.. జగన్ సంక్షేమం తీసికట్టు. అన్ని వర్గాల వారికి మోడీ ప్రాధాన్యత ఇచ్చి పధకాలను అమలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు వికాసం, విజ్ఞానంతో ఆలోచించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్రం అమలు చేస్తున్న అనేక పధకాలను ప్రజలకు వివరిస్తూ, జగన్ మోసాలను బయట పెట్టండి. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం ఒక్క బీజేపీకే ఉందన్నారు సోము వీర్రాజు.
YS Sharmila : కెసిఆర్ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి ?