ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో తమ పార్టీదే ఆధిపత్యం అంటున్నారు పాల్. కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది ప్రజాశాంతి పార్టీయే అన్నారు ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్. రాబోయే ఎన్నికలపైనే తాను ఫోకస్ పెట్టానంటున్నారు. ఆ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు…
జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జీడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు. రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము…
*ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల పర్యటన. ఇవాళ శ్రీకాళహస్తీర్వుడి దర్శనం, తిరుపతి గంగమ్మకు సారెని సమర్పించనున్న స్వామీజీ. * నేడు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని డిమాండ్ *నేడు రాజ్ భవన్ ను ముట్టడించనున్న రాయలసీమ విద్యార్థి సంఘాలు. అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం…
రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ల తో కుమ్మక్కై రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టారు. అదానీ భార్యకి రాజ్యసభ సీటు ఇచ్చే బదులు పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో జగన్ అభాసు పాలయ్యారు. మంత్రి టెన్త్ పేపర్ లీక్ కాలేదని అంటాడు.. సీఎం ఏమో పేపర్ లీకు అయ్యిందంటాడు. జగన్ కి నిజంగా దమ్ముంటే…
కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురముళ్లలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుడి దయతో ఈరోజు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు జగన్ వివరించారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామని తెలిపారు. చంద్రబాబు పాలనలో…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఏపీ ముఖ్యమంత్రి నోట ఈ మధ్య కాలంలో ఎన్నికల మాట వినిపిస్తోంది. ముందస్తు వున్నా లేకున్నా. వైసీపీ నేతలు జనంలోకి వెళ్లాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించడం వెనుక వ్యూహం ఏంటనేది అంతుపట్టడం లేదు. ప్రజల్లో ఉండటం పైనే సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నారు. 12వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ డైరెక్షన్ ఇవ్వడం వెనుక వ్యూహం…
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్య దేవుడిగా ప్రచారం చేసుకుంటున్న జగన్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా తయారయ్యాడని నారా లోకేష్ విమర్శించారు. Read Also: Nellore: సర్కారీ ఆస్పత్రిలో ‘శంకర్‌దాదా’లు..…
ఏపీలోని పలు జిల్లాల ప్రజలు అసని తుఫాన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అసని తుఫాన్ ప్రభావం ముఖ్యంగా కోస్తా జిల్లాలు, గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందన్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అసని తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు…