మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
కర్నూలు నగరంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. కర్నూలులో దేవాదాయ శాఖ కార్యాలయాలకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన, మంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. పెరిగిన ధరలపై చంద్రబాబు అనసర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనసర రాజకీయం చేస్తూ ప్రజల మెప్పుకోసం ప్రజల్లోకి రావాని చూస్తున్నారని…
ఏపీలో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లే అమ్మాయిలకు ఇంటి పేరు మారుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్రంలో చాలా మంది వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లే యువతులు తక్షణమే ఇంటి పేరు మార్చుకుని ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతులు తమ పెళ్లి తర్వాత అత్తింటి తరఫున పేరు మార్చుకునేందుకు వీలుగా గ్రామ సచివాలయంలో…
జగనన్న విద్యాదీవెన పథకం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో జమ అయిన ఈ సొమ్మును వారం, పది రోజుల్లో కాలేజీలకు విద్యార్థుల తల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో నిధులను నేరుగా కాలేజీలకే జమ…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని…
విశాఖ పర్యటనలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత టీడీపీ కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. పార్టీలో పని చేసే వాళ్ళకే పదవులు, ప్రజలతో ఉన్న వాళ్ళకే నాయకత్వ అవకాశం దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 30 ఏళ్లు అధికారంలో ఉండేలా ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో…
ఏపీలో పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతుండటంపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని.. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి లీక్ అయ్యాయని.. మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ ఆరోపించారు. వీళ్ళే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్‌లను బయటకు…
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్ అన్నారు. నేడు సీఎం జగన్ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువులు అన్నవి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని ఆస్తి అని, మన తలరాతను మార్చే శక్తి…
రేపల్లె ఘటన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. బాధితురాలికి టీడీపీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయన్నారు. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడంతో ఇలాంటి పరిస్థితి ఉందని, రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. బాధితురాలు…
ఏపీలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఉదంతాలను నిరసిస్తూ నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నారు. అయితే.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్ జరుగగా, ఆ తరువాత…