1. నేటి నుంచి భక్తులకు శ్రీవారి మెట్టుమార్గం అందుబాటులోకి రానుంది. టీటీడీ నేటి నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతించనుంది. 2. నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా.. బండి సంయ్ ప్రజా సంగ్రామ యాత్ర సభకు హజరుకానున్నారు. 3. నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యాదీవెన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 4. నేడు తాళ్లవలసలో బాదుడే బాదుడు నిరసన…
కేసీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు..…
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని ఆకాశానికెత్తేశారు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు. శ్రీకాకుళంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు జరిగాయి. జలగం వెంగళరావు రాజాం దగ్గర సోపేరు అనే చిన్న గ్రామంలో జన్మించారన్నారు మంత్రి ధర్మాన. మొదట్లో జలగం వెంగళరావు శ్రీకాకుళంలో జన్మించారని చాలామందికి తెలియదు. జిల్లా నుండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వెంగళరావు ఒక్కరే అన్నారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన వ్యక్తి. గతంలో పనిచేసిన…
ఏపీలో జగన్ పాలనపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రోజూ మామూలుగా మారిన అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై టీడీపీ మండిపడుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ అథఃపాతాళానికి వెళ్ళిపోయిందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ విషయంలో మాట్లాడిన అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీలో అధ్వాన్న పరిస్థితిపై మాట్లాడితే వైసీపీ దొంగల ముఠా విరుచుకుపడింది. పక్క రాష్ట్రాల సీఎంలు ఒక్కసారి ఏపీకి రండి. సొంత ఖర్చులు పెట్టి తీసుకొస్తాం. ఏపీని జగన్మోహన్ రెడ్డి…
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. తాజాగా విజయవాడలో ఆమె శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో శిక్షణా శిబిరాలను ప్రారంభించి ప్రసంగించారు. కరోనా వల్ల రెండు ఏళ్లు క్రీడాకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడతాయి. 48 విభాగాల్లో…
ఆంధ్రప్రదేశ్ లో అడగడుగునా అత్యాచారాలు, వేధింపులు. అసలు శాంతిభద్రతలు వున్నాయా అనే అనుమానం కలుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో నేరాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అన్నారు. మహిళా…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి ఆర్‌కె రోజా. నేను మంత్రి అయ్యాక తొలిసారిగా సీఎం జగన్ ఈనెల 5వ తేదీ పర్యటనకు రావడం సంతోషం. గత ప్రభుత్వం హయాంలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. 1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు. సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు…
* నేడు ఉస్మానియా యూనివర్శిటీకి రేవంత్ రెడ్డి. ఓయూ వీసీని కలవనున్న రేవంత్ రెడ్డి. సభకు అనుమతి కోరనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. *నేటినుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం. భక్తుల సంఖ్యపై పరిమితి విధించిన ప్రభుత్వం * నేడు రెండవ రోజు ప్రధాని మోడీ యూరప్ పర్యటన *వరంగల్ లో నేటి నుండి శ్రీ భద్రకాళీ దేవాలయంలో శ్రీ భద్రకాళీ వీరభద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. *తిరుపతి రుయా ఆసుపత్రిలో నేటి నుంచి అందుబాటులోకి…
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రోడ్లు, తాగునీటి సరఫరాపై సోమవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ఆదేశాల్ని జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన ఈ సమీక్షలో.. రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని జగన్ సూచించారు. టెండర్లు పూర్తి చేసి, జూన్ నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యల అంశంపై ఆయన చర్చించారు. మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లికి పింఛన్ ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడిపై పోలీసుల దాడిని టీడీపీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని…