ఏపీలో విద్య, వైద్యం అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు….70 మంది టీచర్లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో లీకేజీకి విద్యామంత్రి బాధ్యత వహిస్తారా…..సీఎం బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 వేల కోట్లు విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. 48 శాతం మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో , 52 శాతం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై 90 వేలు ఖర్చు చేస్తున్నా విద్య తీసికట్టే అన్నట్టుగా ఉందన్నారు.
వైద్యరంగంలో కూడా అదే పరిస్థితి. మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నా…..శవాలు బైక్ లపై తీస్కెళ్లాల్సి వస్తోంది. నెల్లూరులో సెక్యురిటీ గార్డులు వైద్యం చేస్తున్నారట.. కర్నూలులో నాలుగో వంతు వైద్యులు లేరు. అవినీతికి ముందుంటారు….అభివృద్ధికి వెనుకబడి వుంటారు. ఆసుపత్రిలో పరికరాలు నిర్వహణ కాంట్రాక్టు లో అక్రమాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా పనిచేస్తున్నాయి…మంగళగిరి ఎయిమ్స్ కి వెళ్లి చూడండి. రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష లేదన్నారు సోము వీర్రాజు.
కేంద్రం ఇచ్చిన మందులు మట్టిలో పూడ్చేస్తున్నారు…కొన్ని చోట్ల మందులు లేవు. హెల్త్ పై సీఎం , మంత్రికి భయం, శ్రద్ధ లేవు. ఓ బీ ఫార్మసీ అమ్మాయిని లవ్ జిహాదీ పేరుతో అత్యాచారం, మృతి కేసు పెట్టారు. కాకినాడ ఎమ్మెల్యే బీజేపీ ఎంత అంటారు…కర్నూలు జిల్లాలో పాకిస్థాన్ జిందాబాద్ అంటారు. బీజేపీ ఆందోళనలతో ఆలయాలపై దాడులు తగ్గాయి. చెన్నై లో ఆలయం వేలం వేయాలని చూసారు…బీజేపీ అడ్డుకుంది. ఫ్యామిలీ పార్టీలకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. మోడీ , యోగి లాంటి ప్రభుత్వాలు రావాలన్నారు. టీడీపీ , వైసీపీ హయాంలో హోం మంత్రులకు డీఎస్పీ ని కూడా బదిలీ చేసే అధికారం ఉండదు.
ఏపీలో అభివృద్ధి మోడీ ద్వారానే సాధ్యం. కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది…ఏపీలోను బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సోము వీర్రాజు. బీజేపీ దగ్గర నవరత్నాల కంటే ఎక్కువ రత్నాలు ఉన్నాయి. బీజేపీ పొత్తు జనసేనతోనే. ఒకాయన త్యాగం చేస్తామంటారు…ఏం త్యాగం చేస్తారు? ఏపీలో ఫామిలీ పార్టీలు లేకుండా అద్భుతం జరుగుతుందన్నారు.
Asani Cyclone: తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష