ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించేలా వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ ప్లీనరీని నిర్వహించాలని సీఎం జగన్ వైసీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడం, సీఎంగా జగన్…
ఏపీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ యాప్ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్ రూపొందించింది. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనపై సమీక్ష కార్యక్రమంలో ఏసీబీ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టంగా చెప్పామని.. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా…
దావోస్ పర్యటనలో ఏపీ సీఎం జగన్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. సీఎం అయిన తర్వాత ఎక్కువగా తెల్ల రంగు షర్టుల్లో మాత్రమే కనిపించే జగన్ తన తొలి విదేశీ పర్యటనలో క్యాజువల్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్లతో కనిపించారు. ఓ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ఇలా దర్శనమిచ్చారు. దీంతో జగన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చించేటప్పుడు సీఎం జగన్ బ్లేజర్ కోట్ ధరించారు. కాగా దావోస్‌లోని…
ప్రముఖ నటి, పార్లమెంట్ మాజీ సభ్యురాలు, బీజేపీ నేత జయప్రదకు తెలుగు రాజకీయాల్లోకి రావాలని ఉందంటోంది. స్వతహాగా తెలుగు మహిళనైన తనకు తెలుగు రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆశగా ఉందని జయప్రద అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ దిశగా ఆదేశాలు ఇస్తే పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేసాయని బీజేపీ పార్టీ ఆ దిశగా పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించిన…
దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులని విడుదల చేశారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే నిధులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా అందిస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామంలోనే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించారు. రైతులకు అవసరమయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆఫ్రికా దేశాలకు మనలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని…
మహానాడు విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజావిజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందిన నేతలతో అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్‌నే కాదన్నారు. అచ్చెన్నను తన్నటానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడిని అధ్యక్షుడిని చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. Chinta Mohan: మోదీ చేస్తున్న ఆ పనిని ఆపి తీరుతా.. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చా మహానాడు…
జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. మూడేళ్ళ పాలనా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు. తాడేపల్లి పార్టీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడతారు. వీటికి సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి, ఇతర నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు నిర్వహించనున్నారు. బలహీన వర్గాలకు ప్రభుత్వం…
వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలపై మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి మొహాన్ని కనబడకుండా చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు.సామాజిక న్యాయానికి సమాధులు కట్టి బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. వై.వి.సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన వాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..?ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ…