వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలపై మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి మొహాన్ని కనబడకుండా చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు.సామాజిక న్యాయానికి సమాధులు కట్టి బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు.
వై.వి.సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన వాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..?ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క వర్గానికైనా ఇచ్చారా? అని రవీంద్ర ప్రశ్నించారు. రేట్లు కట్టి ఎంపీ టికెట్లు అమ్ముకునే జగన్ సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..? అంధ్రా వాళ్ళు దోచుకుంటున్నారన్న ఆర్.కృష్ణయ్యకు రాజ్య సభ సీటా..? ఆర్.కృష్ణయ్య అనేక మందిని బ్లాక్ మెయిల్ చేశాడు. అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. ఇక్కడ కొత్త పార్టీ పెడతానన్న ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటా..? వైసీపీ అంబోతులు బస్సులెక్కి రంకెలేస్తున్నాయి. వైసీపీ సభల నుంచి ప్రజలు పారిపోతున్నారన్నారు. మహానాడు పై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Southwest Monsoon: కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు