విశాఖలోని బ్రాండిక్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని బ్రాండిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి , దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజీపీ డిమాండ్ చేస్తోందన్నారు. విశాఖపట్నంలో అత్యంత విషాదంగా ఘటన ఎల్జీ పాలిమర్స్ తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు చర్యలు…
విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు. వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు…
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని తిరిగి రెండోసారి ఎంపికచేశారు సీఎం జగన్. అలాగే బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, సుప్రీంకోర్టులో న్యాయవాది ఎస్,నిరంజన్‌రెడ్డిలకు జగన్…
హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్.జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్‌జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు – వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశంకూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూరై్తనా ఇప్పటికీ ఆస్తుల…
మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు, పోలీసులు, వాలంటీర్లు చేస్తున్న అరాచకాల నుంచి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! అంటూ సీఎం జగన్‌పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుందని ఆయన ఆరోపించారు. తన ఇంటి ముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది…
జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదు అని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉంది.. దీనికి సీఎం జగన్ సిగ్గుపడాలి అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు…
ఏపీలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఎంత గందరగోళాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎట్టకేలకు నిర్వఘ్నంగా ముగిసిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా…
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఆపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర మంత్రిని…
నేషనల్ హెల్త్ మిషన్ విభాగం ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజనీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పని చేస్తోందని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లక్ష్యాలు పూర్తి కావాలని, అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉండటానికి వీల్లేదని,…