ప్రముఖ నటి, పార్లమెంట్ మాజీ సభ్యురాలు, బీజేపీ నేత జయప్రదకు తెలుగు రాజకీయాల్లోకి రావాలని ఉందంటోంది. స్వతహాగా తెలుగు మహిళనైన తనకు తెలుగు రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆశగా ఉందని జయప్రద అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ దిశగా ఆదేశాలు ఇస్తే పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేసాయని బీజేపీ పార్టీ ఆ దిశగా పోరాటం చేస్తుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించిన తరువాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని జయప్రద సూచించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. బొల్లి మచ్చలు ఉన్న వారు నిరాశ చెందొవద్దని … అత్యాధునిక టెక్నాలజీ , ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని జయప్రద అన్నారు. మహిళలు అందంపై ఎక్కువ మక్కువ చూపుతారని… తమ అందానికి మచ్చలు అడ్డుకాదని గ్రహించాలన్నారు. బార్బీ స్కిన్ కేర్ క్లినిక్ లో అనుభవం కలిగిన వైద్యులు ఉన్నారని… మహిళలు తమ అందాన్ని బార్బీ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు అన్నారు.
తెలుగు చిత్రాల్లో తనకంటూ గుర్తింపు పొందిన జయప్రద గతంలో టీడీపీలో ఆమె పనిచేశారు. రాజమండ్రికి చెందిన జయప్రద తన గత 28 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పార్టీలు మారారు. 1994లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 1996లో జయప్రదను రాజ్యసభ సభ్యురాలిగా మరియు పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా చేశారు.
వివిధ కారణాల వల్ల పార్టీలో విభేదాలు వచ్చాయి. జయప్రద తర్వాత ఏపీ నుంచి యూపీ రాజకీయాలకు మారారు. 2004లో రాంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ 2009లో తిరిగి ఎన్నికయ్యారు. తాజాగా తిరిగి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట చెప్పారు. అయితే ఆమె ఏపీ రాజకీయాలవైపే ప్రధానంగా ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. 019లో బీజేపీలో చేరిన జయప్రద.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పార్టీ క్యాడర్‌లో ఉన్నందున తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
Jammu & Kashmir: రెచ్చిపోయిన ఉగ్రమూక.. టీచర్ మృతి