మోడీ ప్రభుత్వం విధానాలు ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాలాంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. విద్యుత్ బిల్లులు బొగ్గు దిగుమతులు చేసుకోవడంపై రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలం అవసరం ఉంది……
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ ఇప్పటికే.. ప్రధాని మోడీతో సమావేశమై పలు కీలక విషయాల గురించి చర్చించారు. మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు 20 నిమిషాల పాటు సాగింది. అయితే.. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 2017-18 ఆర్ధిక సంవత్సరం ధరల ఆధారంగా పోలవరం…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర…
అమరావతిలో నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని, ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన…
అవినీతి చేసే ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం యాప్ ఎందుకు పెట్టలేదు అంటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రభుత్వ అండ లేకుండా ఎవరైనా మైనింగ్ చేయగలరా..? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాల గురించి బొల్లా బ్రహ్మానాయుడు, విత్తన అక్రమాల గురిoచి ఆర్కే మాట్లాడలేదా..? అని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులోకి లారీలు వెళ్లాలంటే కాకాణి టోల్…
సీఎం జగన్ లాభాపేక్షకు విద్యారంగం నాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైందని ఆయన మండిపడ్డారు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా వేలి ముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైందని, చంద్రబాబు బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక 10శాతం…
రాజధాని నిర్మాణంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి సంతకం రాజధాని నిర్మాణ పనులపైనే అంటూ స్పషీకరించారు. అంతేకాకుండా.. రాజధాని నిర్మాణం మూడేళ్లల్లో పూర్తి చేస్తామని, అధికారంలోకి వస్తే రాజధాని పనుల మీదే బిజెపీ మొదటి సంతకం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఒకాయన ఎక్కడికెళ్లినా ఆ మోడల్ కేపిటల్ కడతానంటారు.. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిని విశాఖకు తీసుకెళ్తానంటాడు ఇంకొకాయన.. బీజేపీ అమరావతిలోనే…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంపిక చేశారు సీఎం జగన్. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు…
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి సీఎం జగన్ షాకిచ్చారు. ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేయడంతో కొత్తపల్లిని జగన్ సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తనకు ఓట్లు పడతాయని మంగళవారం నాడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ ప్రకటించకుండా తాను వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.…
ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. జూన్ నెలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బుధవారం నాడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ప్రకటించారు. జూన్ 7న రైతన్నలకు 3,800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 14న రైతులకు పంటల బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. జూన్ 23న అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తామని జగన్ తెలిపారు. YSRCP: వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ.. భారీ ఎత్తున…