శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతానని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్‌నే కాదన్నారు. అచ్చెన్నను తన్నటానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడిని అధ్యక్షుడిని చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు.
Chinta Mohan: మోదీ చేస్తున్న ఆ పనిని ఆపి తీరుతా.. అందుకే ఢిల్లీ వెళ్లొచ్చా
మహానాడు వేదికపై మాట్లాడిన ప్రతి ప్రేలాపనకూ అచ్చెన్నాయుడికి సమాధానం చెబుతానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆకాశ లక్కవరం, వడ్డీతాండ్ర గ్రామాలకు వెళ్లలేని దుస్థితి అచ్చెన్నాయుడిదేనని, ఆయన నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆహుతి సినిమాలో విలన్‌ను కొట్టినట్టు తరిమి తరిమి కొడతానని దువ్వాడ పేర్కొన్నారు. అటు పేదల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం జగన్ కోసం తాను ఆత్మాహుతి దళం సభ్యుడిగా మారతానని ఎమ్మెల్సీ దువ్వాడ వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు రాజకీయ పతనమే తన జీవిత లక్ష్యమని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నేతలు పిచ్చి కలలు కంటున్నారని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం భ్రమేనని చురకలు అంటించారు. కాగా 2021లో ఎమ్మెల్యే కోటాలో దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవిని సీఎం జగన్ కట్టబెట్టారు.