CM Jagan: ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈనెల 18న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, సబ్ స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నర్సాపురం బస్టాండ్, 100 పడకల ఆస్పత్రికి…
CM Jagan: ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన…
YSRCP: అనంతపురం జిల్లాలో వైసీపీ కీలక నేత కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున తాను జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించలేకపోతున్నట్లు లేఖలో కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష…
Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రముఖ నటుడు అలీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ చెప్పారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఏం కావాలో మరీ తెలుసుకుని సీఎం జగన్ అన్నీ చేస్తున్నారని..…
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డిపై రచించిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి చిరస్మరణీయుడు పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి…
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా…
Vidadala Rajini: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ను సోమవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్‌కు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేశామని తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సిస్టం కోసం సుమారుగా రూ.50 కోట్లను ఖర్చు చేశామని మంత్రి విడదల రజినీ వెల్లడించారు. పొల్యూషన్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు.…
Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రికి ప్రధాని మోదీ విశాఖలోనే బస చేస్తారు. ఈనెల 12న ఉదయం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు…
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో…