Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల చట్టబద్ధతపై ఏపీ కేబినెట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంపై సోమవారం నాడు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయడంతో ఆయా అంశాలపై భవిష్యత్‌లో…
Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు.…
CM Jagan: ఏపీ సీఎం జగన్ బుధవారం నాడు విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరుకానున్నారుఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభ జరగనుంది. ఈ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం…
Somu Veerraju: ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మంగళవారం ఉదయం లేఖ రాశారు. ఈ సందర్భంగా 2004 నుంచి విశాఖలో, ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖలో కోరారు. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ అక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములే కాదు సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని సోము వీర్రాజు…
Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం కానున్నారు. ఈ భేటీకి మొత్తం 9 మంది నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 9 మందిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముత్యాలనాయుడుతో పాటు ఎంపీ మోపిదేవి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరుకానున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు…
CM Jagan: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో సీఎం జగన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ వెళ్తుండగా.. ఆయన్ను చూసిన కొంతమంది కలవడానికి ప్రయత్నించారు. అంత రద్దీలోనూ వారిని గమనించిన జగన్.. ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడొద్దని…
Nadendla Manohar: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీని రౌడీసేన అంటున్నారని.. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయని.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని…
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ వరుస పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈనెల 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఉదయం 11…
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని రౌడీసేననగా సంభోదిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎందుకు రౌడీసేన సీఎం జగన్ గారూ అంటూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా అని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం రోడ్డున…