Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..
- పది రోజులుగా కనపడని పాత బస్తీ యువకుడు..
- పాడుబడిన బావిలో శవమై తేలిన వైనం..
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపిన యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. పది రోజులుగా ఆచూకీ లేని యువకుడు ఓ పాడుబడిన బావిలో శవమై తేలడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో పెరుగుతున్న నేరాలు, అనుమానాస్పద మరణాల నేపథ్యంలో ఈ ఘటన పోలీసులకు సవాలుగా మారింది.
బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..
హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ కుమార్ (20) అనే యువకుడు గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. మార్చి 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన గౌతమ్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
Also Read:Minister Komati Reddy: డబుల్ డెక్కర్ కారిడార్‌గా హయత్‌నగర్-L.B నగర్ రూట్.. మంత్రి కోమటి రెడ్డి..
అయితే.. మార్చి 13వ తేదీ రాత్రి రాజన్న బావి సమీపంలోని ‘పులమ్మ బావి’ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో చూడగా ఒక మృతదేహం కనిపించింది. ట్యాంక్ బండ్ శివ బృందం సహాయంతో మృతదేహాన్ని వెలికితీయగా.. అది గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయి, అస్థిపంజరంలా మారిపోయింది.
హత్యా? ఆత్మహత్యా?
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అది అదృశ్యమైన గౌతమ్ కుమార్‌దిగా ప్రాథమికంగా గుర్తించి… పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారుజ పది రోజుల పాటు యువకుడు ఎక్కడ ఉన్నాడు..? ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!