Harirama Jogaiah: కాపు రిజర్వేషన్‌ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య ఏపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. అగ్రవర్ణాల మాదిరిగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో డిసెంబర్ 30 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నామని.. అప్పటివరకు కాపు రిజర్వేషన్‌ల అమలుపై స్పష్టత ఇవ్వకపోతే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని హరిరామజోగయ్య హెచ్చరించారు. తాను చచ్చి అయినా కాపులకు రిజర్వేషన్‌లు సాధించుకుని…
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన అర్హులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఈ మేరకు 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ జమ చేశారు. ఏటా జూన్, డిసెంబర్ నెలలో పెండింగ్ దరఖాస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని మీడియా…
Minister Roja: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జగనన్న క్రీడా సంబరాల బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు రూ.50 లక్షల ప్రైజ్ మనీని మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి అందజేశారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడల్లో ప్రతిభ చూపిన మెన్స్, ఉమెన్స్ టీమ్‌లకు ప్రైజ్ మనీ అందజేశారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. హీరోల కంటే జగనన్నే యంగ్‌గా ఉన్నారని.. క్రీడలు, యువత అంటే జగన్‌కు ఎంతో ఇష్టమని తెలిపారు. యువతకు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో.. దేశాల్లోనూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు.. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని ఆక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, వైఎస్ జగన్‌కి నా హృదయపూర్వక అభినందనలు…
Andhra Pradesh: ఈనెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేకంగా క్రిస్మస్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. వేదికపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఇతర నేతలు ఆశీనులు అయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. Read Also: Pakistan: ఇంగ్లండ్ చేతిలో క్లీన్…
Sajjala: ఈనెల 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారత కోసం ప్రయత్నిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు అని సజ్జల కీర్తించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వంటి అన్ని రంగాల్లో జగన్ కీలక మార్పులు తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు. రాజకీయ, ఆర్ధిక,…
CM Jagan: వచ్చే ఏడాది అమెరికాలో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాటా తెలుగు మహాసభలకు ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడితో పాటు పలువురు నాటా సభ్యులు సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలంటూ ఆయన్ను ఆహ్వానించారు. నాటా తెలుగు మహాసభలు 2023 జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డల్హాస్‌లో జరగనున్నాయి. ఈ…
Andhra Pradesh: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సమాధానం ఇచ్చింది. ఏపీలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉందని.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత మూడేళ్లుగా ఏపీలో అప్పుల…
CM Jagan: అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. రూ.2,500 పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్…