మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు,…
లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రేస్‌లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..! విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది…
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు కెఎస్.జవహర్ రెడ్డి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ రెడ్డి. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ…
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తెల్లవారుజాము నుంచే ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామ, సచివాలయాల ఆధ్వర్యంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు లబ్దిదారులకు పెన్షన్ అందజేస్తున్నారు. ఈ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయి. ఇందుకోసం 1417.53 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా లబ్దిదారులకు ఇంటింటి తిరిగి వాలంటీర్లు పెన్షన్లను…
ఒకే ఒక్క మాటతో టీడీపీ నాయకుడు పట్టాభి రేపిన వ్యాఖ్యల దుమారంతో రేగిన చిచ్చు ఇప్పుడు ఢిల్లీని తాకింది. వైసీపీ, టీడీపీలు ఎత్తుకు, పైఎత్తు వేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. అయితే అధికార వైసీపీ త్రిముఖ వ్యూహంతో టీడీపీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. ఏపీలో వ్యవస్థలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది బాబు…
ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వ కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ నాయుడు పై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు…
గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు.…
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దాసరి కిరణ్.
టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న మహిళ సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి…చేతులెత్తేసిందన్నారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేసిందని ఆరోపించారాయన. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపెడయ్యాయని, 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడితో భారం పోయేదన్నారు జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామన్నారు.…
తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్‌ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి…