ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ ప్రాంతానికి మంచి చేసే ప్లాంట్ రాబోతోంది. రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్‌ను ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఏపీ మంచి వాతావరణం ఉంది. కేవలం ఆరు నెలల కాలంలోనే అనుమతులు మంజూరు చేసి.. ఈ రోజు భూమి పూజ కూడా చేశాం. 2లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ రాబోతుంది. ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్రోకెన్ రైస్‌తో ప్లాంట్‌లో ఇథనాల్ తయారీ చేస్తారు. ప్లాంట్‌తో పాటు బైప్రోడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుంది. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది’ అని సీఎం జగన్ అన్నారు.
కాగా, రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ఇథనాల్ వల్ల విదేశీ మారకద్రవ్యం కూడా సమకూరనుంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ.. వ్యవసాయాధారత జిల్లా ఉమ్మడి తూగోజిల్లా ను పారిశ్రామికంగా అభివృధ్ధి చేస్తాం. రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు రానున్నాయి.. పరిశ్రమలకు శంకుస్థాపనలు జరుగుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో విమర్శలు చేస్తున్నాయన్నారు. రానున్నకాలంలో పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఊతం లాంటిది. లక్షన్నర కోట్లు పెట్టుబడులు రానున్నాయి. 2 లక్షలమందికి ఉపాధి కలుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుంది. పారిశ్రామిక జిల్లాగా తీర్చిదిద్దుతాం అన్నారు.
Read Also: Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..
టెక్ మహేంద్ర సాఫ్ట్ వేర్ కంపెనీ సిఇవో సీపీ గుర్నానీ కొడుకు ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమను గుమ్మళ్ళదొడ్డిలో 270 కోట్లతో నిర్మిస్తున్నారు. దావోస్ ఇండస్ట్రీస్ సదస్సులో తాను పరిశ్రమ పెట్టాలని గుర్నానీని కోరా. అఁదులో భాగంగానే 2లక్షల లీటర్లు ఉత్పత్తి లక్ష్యంగా దీనిని నిర్మిస్తున్నారు. స్థానికంగా 75శాతం ఉద్యోగాలు వస్తాయి. గోదావరి జిల్లాలలో వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యం , బ్రేకెన్ రైస్ తో ఈ ప్లాంట్ పనిచేస్తుందన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది .. తడిసిన ధాన్యాన్నికి రైతులకు గిట్టుబాటుధర లభిస్తుంది. గుర్నానీ స్ఫూర్తితో రాష్ట్రంలో వస్తాయనే ఆశాభావం వుందన్నారు జగన్. అందుకు తగిన సహకారం సంపూర్ణంగా అందిస్తాం….వారు ఎప్పుడైనా నన్ను కలవచ్చు…ఎమ్మెల్యే జగ్గంపేట చంటిబాబు కోరిన విధంగా ఏలేరు కుడికాల్వ ఆధునీకీకరణ పనులకు నిధులు శాంక్షన్ చేస్తున్నా అన్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాలో మెట్టప్రాంతంలో పరిశ్రమలకు అనుకూలమెక్కువ. పరిశ్రమలు స్థాపనకు ఎక్కువ అవకాశాలున్నాయి. సిఎం జగన్ మా ప్రాంతంలో పరిశ్రమలకు ఏర్పాటుకు మ రింత అవకాశమివ్వాలి. జగన్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మా పద్దతులు మార్చుకుంటాం…ఒళ్ళు హునం చేసుకుని గడపగడపకూ తిరుగుతాం…పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాం….తిరిగి జగన్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం అన్నారు ఎమ్మెల్యే చంటిబాబు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, ఆశీష్.. మంత్రులు గుడివాడ అమర్ నాధ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్ , అనురాధ,వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.