Andhra Pradesh: గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగినట్లు అవుతుంది. తద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణుల రూపంలో మానవవనరులను ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
Read Also: Pawan Kalyan: విద్యుత్ షాక్‌తో రైతుల మృతి బాధాకరం.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి
Also Read
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
కాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తోంది. ఈ మేరకు 1254 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. 106 ప్రొఫెసర్ పోస్టులను, 312 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసి వేగంగా వీటిని భర్తీ చేసే ప్రక్రియ చేపట్టింది. అవసరమనుకుంటే ప్రైవేట్ రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వ రంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే వాక్‌ఇన్ ఇంటర్వ్యూలాంటి పద్ధతులను వైద్య ఆరోగ్యశాఖ అవలంభిస్తోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వం చేపట్టిన చర్యల కారనంగా స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డమే కాకుండా, వైద్య రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల కారణంగానే సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీల్లో బోధనావసరాలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తైతే, నిర్ణీత సమయానికి సుమారు మరో 3 వేల పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో జనాభాకు అవసరాలకు తగినట్లుగా, ప్రతి ప్రాంతంలో కూడా అత్యంత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?