Assam tension: ఈద్ రోజున కొందరు దుండగులు హిందువులు ఆలయాలు, ప్రాంతాలను అపవిత్రం చేయడం అస్సాంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేరస్తులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. ‘‘షూట్-అట్-సైట్’’ ఆదేశాలు జారీ చేశారు.
BJP: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా తెలియజేశారు.
స్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం నాడు తవ్వకాలు కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 100 అడుగుల మేర నీళ్లు ప్రవేశించాయి. దాంతో తొమ్మిది మంది కార్మికులు అందులో చిక్కుకొన్నారు. అయితే, వారిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్ చేశారు.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ అల్లర్ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, అస్సాంలో తగ్గుతున్న హిందూ జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
Muslim Marriages: అస్సాం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం - 1935 రద్దు బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాలీ మాట్లాడే ‘మియా ముస్లింలు’ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు.