Assam: వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలుకు వ్యతికేరంగా ఇవాళ అస్సాం (Assam) లోని ప్రతిపక్ష కూటమి రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో సీఏఏను అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని 16 పార్టీల అస్సాం యునైటెడ్ అపోసిషన్ ఫోరమ్ (UOFA) వెల్లడించింది. దీని వల్ల అస్పామీస్ కమ్యూనిటీ విచ్చిన్నమయ్యే ఛాన్స్ ఉందన్నారు. తమ భాషను, సాహిత్యం, సంస్కృతి, గుర్తింపును కోల్పోతామని వారు స్పష్టం చేశారు.
Read Also: Mallikarjun Kharge: లోకసభ ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..!
కాగా, ప్రతిపక్షాల బంద్ పిలుపుపై రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఇలాంటి నిరసనలను గువాహటి హైకోర్టు గతేడాది మార్చిలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని తెలిపారు. బంద్‌లు చట్టవ్యతిరేకమని, రాజ్యాంగానికి విరుద్ధమని హైకోర్టు చెప్పిందనే విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. బంద్ చేసినట్లయితే ఆయా పార్టీల రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అవుతాయని ఆయన తేల్చి చెప్పారు. బంద్ సందర్భంగా జరిగే ఆర్థిక నష్టాన్ని నిరసనకారులు, వాటిని నిర్వహించే బాధ్యుల నుంచి వసూలు చేస్తామని అస్సాం సీఎం హెచ్చరించారు. అయినప్పటికీ సీఏఏ అమలుపై తాము వెనక్కి తగ్గేదిలేదని విపక్ష కూటమి వెల్లడించింది.
Read Also: Traffic Restrictions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలను విడగొట్టడమే బీజేపీ పన్నాగం అని సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ విమర్శించారు. దీని వల్ల బెంగాల్, అస్సాం, త్రిపురలో ఓట్లు పొందొచ్చని బీజేపీ చూస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. కాగా, విపక్షాల బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను పోలీసులు మోహరించారు.