Muslim Marriages: అస్సాం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం – 1935 రద్దు బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. వాస్తవానికి అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టాన్ని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే క్యాన్సిల్ చేసింది. తాజాగా గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో.. ఆ రద్దు నిర్ణయానికి బలం చేకూర్చే బిల్లుకు ఆమోదం దొరికింది.
Read Also: Joe Biden: బైడెన్కి విజయావకాశాలు తగ్గిపోయాయి.. పోటీపై మరోసారి ఆలోచించుకో.. !
కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అలాంటి బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగానే ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేశాం అని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ వెల్లడించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు వివాదాస్పద అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోందని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.