BJP: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 376 జిల్లా పరిషత్ స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 300 స్థానాలు గెలుచుంది. 76 శాతానికి పైగా ఓట్లు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2192 స్థానాల్లో 1436 స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మొత్తం మీద 66 శాతం ఓట్లతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Read Also: BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో “బ్రహ్మోస్”కి సూపర్ క్రేజ్.. కొనుగోలుకు 17 దేశాలు క్యూ..
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వానికి పటిష్టం చేస్తుందని అన్నారు. ఎన్డీయే సంక్షేమ పథకాలను ఆయన హైలెట్ చేశారు. ప్రచారంలో మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్‌లకు థాంక్స్ తెలిపారు. 2018 పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లు 25 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.