Himanta Biswa Sarma: హిందూ జనాభా తగ్గింది.. అస్సాం, బెంగాల్, జార్ఖండ్‌లో ఇదే పరిస్థితి..
- హిందూ జనాభా తగ్గుతుందన్న సీఎం హిమంత బిశ్వ శర్మ..
- అస్సాంలో 10 శాతం తగ్గింది..
- బెంగాల్..జార్ఖండ్‌లో ఇదే పరిస్థితి..
- బంగ్లాదేశ్ హింసపై ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ అల్లర్ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, అస్సాంలో తగ్గుతున్న హిందూ జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అస్సాం, బంగ్లా రెండింటిలో 2011 వరకు అనధికార జనాభా గణన డేటా ఇదే విషయాన్ని చూపుతుందని చెప్పారు. అస్సాంలో 1951 నుండి 2011 వరకు హిందూ జనాభా తగ్గిందని, ఇదే విషయాన్ని జనాభా గణన నివేదిక పేర్కొందని, అస్సాంలో 9.23 శాతం, బంగ్లాదేశ్‌లో 13.5 శాతం క్షీణించినట్లు చెప్పారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గాజా పరిస్థితిపై శ్రద్ధ చూపుతోందని, బంగ్లాదేశ్ హిందువులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ దేశ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని, క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుతుంది, కానీ హిందువుల గురించి మాట్లాడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ సరిహద్దుకు ప్రజలు రావడం గురించి హిమంత మాట్లాడుతూ.. సరిహద్దు దాటడానికి ఎవరిని కేంద్ర ప్రభుత్వం అనుమతించదని అన్నారు. ఇది పరిష్కారం కాదని ప్రజలు సరిహద్దులు దాటేందుకు మేము అనుమతించలేమని చెప్పారు. దౌత్యమార్గాల ద్వారా బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతను నిర్ధారించడమే పరిష్కారమని చెప్పారు.
भारत और बांग्लादेश की जनगणना के आधार पर, 1951 से 2011 के बीच असम में हिंदू जनसंख्या में 10% की कमी आई है और बांग्लादेश में यह कमी 13% रही है। अर्थात, असम और बांग्लादेश में हिंदुओं की घटती जनसंख्या की दर लगभग समान है। pic.twitter.com/IahGfaOtq5
— Himanta Biswa Sarma (@himantabiswa) August 10, 2024
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!