ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.. తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ.. అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ…
విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణ. నేడు జేసీ ముందు హాజరుకానున్న నలుగరు డిప్యూటీ కలెక్టర్లు సహా ఏడుగురు అధికారులు. సంగారెడ్డిలో నేడు కాంగ్రెస్ నాయకుల భేటీ. జగ్గారెడ్డి అధ్యక్షతన ప్రారంభంకానున్న సమావేశం. MLC అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. నేడు నెల్లూరు జిల్లాలో మంత్రుల పర్యటన. ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న నాదెండ్ల, ఆనం, నారాయణ. నేడు వనపర్తి జిల్లాలో మంత్రులు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి…
వైఎస్ జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో... జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు..
చంద్రబాబు తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు అని విమర్శించారు జగన్.
అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉందని.. ఇలాంటప్పుడు ఎక్కడికీ అనుమతి లేకుండా వెళ్లకూడదు.. కానీ, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తూ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు..
ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుందని, అద్భుతమైన అభివృద్ధి జరగబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నాం అని, ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందన్నారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. గురువారం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం…
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. మరోవైపు పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదల అంశంపై చర్చ జరగనుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయం కోరనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో…
మిర్చి రైతులను ఆదుకొండి అంటూ కేంద్రానికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం... మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు..