భారత్‌లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోంది.. ‘RAW’పై ఆంక్షలు విధించాలి..
భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తప్పుడు ప్రచారం చేసింది. మంగళవారం తన నివేదికలో భారత్, వియత్నాం దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు వేర్పాటువాదుల కుట్రల్లో పాల్గొన్న భారతీయ గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW)పై ఆంక్షలు విధించాలని సూచించింది. భారత్‌లో 2024లో మత స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని USCIRF నివేదించింది. ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీలపై దాడులు, వివక్ష పెరిగాయని తెలిపింది. భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆయన పార్టీ బీజేపీ మస్లింలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాయని ఆరోపించింది. గతేడాది మోడీ మైనారిటీలను చొరబాటుదారులుగా అభివర్ణించినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఉష్టోగ్రతలు.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ
ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడుల సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఫస్ట్ వాటర్ బెల్, 11 గంటలకు సెకండ్ వాటర్ బెల్, 12 గంటలకు థర్డ్ వాటర్ బెల్ మోగించాలని సూచించారు. వాటర్ బెల్ సందర్బంగా టీచర్లు తరగతులు నిలుపుదల చేసి వెంటనే విద్యార్ధులు వాటర్ తాగేవరకు చూడాలని ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారు
మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు జ్యూడిషియల్ వ్యవహారాలపై మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పినా, సీఎం సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఎలాంటి పరిణామాలు జరగలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని సీఎం సభలో వ్యాఖ్యానించారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ కాదని చెప్పడం ద్వారా సీఎం తన పరిధిని దాటి సుప్రీంకోర్టు పై మాట్లాడారని ఆయన విమర్శించారు. రూల్ బుక్ చదివి వినిపించినా సీఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.
దుష్ప్రచారం చేసిన వాళ్లకు కేంద్ర ఇచ్చిన సమాధానం చెంపపెట్టు
తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని కవిత వ్యాఖ్యానించారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేని బహిష్కరించిన బీజేపీ..
బీజేపీని గత కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యాత్నాల్‌ని బీజేపీ బహిష్కరించింది. పార్టీని, పార్టీ సీనియర్ నేత బీఎన్ యడియూరప్పకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగా 6 సంవత్సరాలు బహిష్కరించింది. పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ మార్చి 26, 2025న యత్నాల్‌ని బహిష్కరిస్తున్నట్లు లేఖ జారీ చేసింది. ఫిబ్రవరి 10న యత్నాల్‌కి షోకాజ్ నోటీసులు పంపినప్పటికీ స్పందించలేదని, పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘించడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బహిష్కరణ జరిగింది.
శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు.. భయంకర పరిస్థితులు
భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన సమయంలో భవనంలో ఆరుగురు నుంచి ఏడుగురు వరకు ఉండే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు భద్రాచలం లంబాడీ కాలనీకి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ధృవీకరించారు. మిగిలిన వారిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భవనం పూర్తిగా శిధిలాలకుపోయిన కారణంగా, సహాయచర్యలు మెల్లగా కొనసాగుతున్నాయి.
చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే.. జగన్ విధ్వంసం చేశాడు
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గతంలో చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ నిర్వాహకం వల్ల కొత్తగా రూ. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోంది. గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా రూ. 50 వేల కోట్లు నష్టపోయాం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రూ. 12,157 కోట్ల రూపాయలు నిధులు సాధించారు.
విద్యా కమిషన్ ఏర్పాటు.. పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారడానికి ప్రభుత్వమే కాకుండా, సమాజం కూడా జవాబుదారీగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలను ఈ కమిషన్ పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఒక కలెక్టర్‌ను సులభంగా బదిలీ చేయగలిగినా, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బదిలీ చేయలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. విద్యా కమిషన్ ఏర్పాటుతో విద్యా వ్యవస్థను సమర్థంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
జిల్లా ప్రగతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలకు సంబంధించి సీఎం నారా చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని పారిశ్రామిక అభివృద్ధికై ఏపీఐఐసీ కేటాయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.28 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.. చిత్తూరు జిల్లాలో 3.65 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా లైవ్ స్టాక్ ప్రాజెక్టు అమలుకై ప్రతిపాదించడంపై అభినందనలు తెలిపారు.
యూపీఐ సర్వర్ డౌన్ .. ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లు
డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. చేతిలో నగదు లేకున్నా చింతించాల్సిన అవసరం లేకుండాపోయింది. అయితే కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల యూపీఐ సేవలు నిలిచిపోతే యూజర్లు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. తాజాగా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావడం లేదని.. బ్యాలెన్స్ చెక్ చేసుకొందామన్నా సాధ్యం కావడం లేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అన్ఏబుల్ టు లోడ్ అకౌంట్ అనే మెసేజ్ వస్తోందంటూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లు వాపోతున్నారు.