కూటమి ప్రభుత్వం పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని వ్యాఖ్యానించిన ఆమె.. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ పిలుపునిచ్చారు... చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయార్జన శాఖలపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టెక్నాలజీ సహాయంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వినుకొండ మండలం శివాపురం వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బొలెరో ట్రాలీ.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి వ్యవసాయ కూలీలను వినుకొండకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ…
కేంద్ర నౌకాయాన జల రవాణాశాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం ఇవాళ ఏపీకి రానుంది. సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం కానుంది. ఏపీలో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుపై సీఎంతో కేంద్ర అధికారులు మాట్లాడనున్నారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. రాష్ట్రంలో నౌకల మరమ్మత్తుల కేంద్రం నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనా. ఏటా 300 నౌకలు రీసైక్లింగ్ కోసం రానున్నాయి. ఏపీలో…
నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా... మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు తారక రామారావు (ఎన్టీఆర్) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై గీత నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో తారక రామారావు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు. Also Read: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్…
పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. అన్ని పార్టీలకు చెందినవారికి సముచిత స్థానం కల్పిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. ఇవాళ 22 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ మరో లిస్ట్ విడుదల చేశారు..
మత సంఘాలతో కలిసి ఇంటర్ ఫెయిత్ సమావేశం జరుగుతున్న సమయంలోనే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సీజ్ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత్ దేశానికి మరో దేశం మీద యుద్ధం చేయాలని ఉండదన్నారు. దేశం మొత్తం మతాలకు, కులాలకు అతీతంగా పాక్ దాడులను ఖండించాలన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదు అని సీఎం అన్నారు. భారత్‌ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందరం ఐక్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ తల్లిదండ్రులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు సీఎం మౌనం పాటించారు. ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో వీర సైనికుడు…