ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు..
Off The Record: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారాయన. అయితే… 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ…పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ… ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన పది నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తాము అధికారంలో…
మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు..
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు.
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ. విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన. మూడు…
కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం.. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
రెడ్ బుక్ మరువను... కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను అంటూ మరోసారి స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదు. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని పిలుపునిచ్చారు.
టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు.
తెలుగుదేశం పొలిట్‌బ్యూరో.. పార్టీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయాన్ని కలిపిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ విడతలవారీగా జరుగుతోంది. తాజాగా డీసీసీబీ, మార్కెట్ యార్డ్ కమిటీల పదవుల పందేరం నడుస్తోంది. అదే సమయంలో అసంతృప్త స్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు రానివాళ్ళతో పాటు పార్టీ వీర విధేయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని టీడీపీ అధిష్టానం చెబుతున్నా.... అదే రేంజ్లో ఉన్న అందర్నీ సంతృప్తి పరచడం మాత్రం సాధ్యం కావడం లేదట.