నేడు ఏపీకి కేంద్రమంత్రి పీయూష్ గోయల్. పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు లంచ్ మీట్. లంచ్ తర్వాత గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి పీయూష్ గోయల్. రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో పీయూష్ గోయల్ సమీక్ష.
నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పొంగులేటి.
ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక.
నేటి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి విదేశీ పర్యటనకు మోడీ.
నేటి నుంచే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గింపు. కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారితో పాటు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా ఈ వెసులుబాటు. ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన రేపో రేటు తగ్గింపును అనుసరిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్న ఎస్బీఐ.